పల్లె సృజనుడు … తెలుగు శాస్త్రజ్ఞుడు.
శ్రీ బొమ్మగాని మల్లేష్, మోత్కూరు, నల్గొండ జిల్లా , తెలంగాణ రాష్ట్రం లో యువ శాస్త్రవేత్తగా అతి ప్రతిస్తాత్మకమైన జాతీయ ఇన్నోవేషన్ అవార్డుని స్వంతం చేసుకుని తనదైన మేధా శక్తితో కొత్త కొత్త 15 ప్రయోగాలూ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్న ఈ యువ శాస్త్రజ్ఞుడు నామమాత్రంగానే చదువుకున్నాడు, ఇంజనేరింగ్ లాంటి పట్టాలు ఏమి లేకున్నా తనకున్న పరిజ్ఞానం తో ఇంతవరకు ఎవరు కనిపెట్టని శాత్త్ర పరిజ్ఞానం తో వివిధరకాల పరికరాలను తయారీ చేసి అబ్దుల్ కలాం గారి నుండి ప్రసంశలు పొందిన ఈ యువ పల్లె సృజనుడు … తెలుగు శాస్త్రజ్ఞుడు గా తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో యువ శాస్త్రవేత్తలు అనే విభాగం లో తన పేరుని నమోదు చేసున్నట్టు అధికారికంగా తెలిజేస్తూ దృవీకరణ పత్రాన్ని అందజేస్తున్నాము.

