Tharanga

Awards / Certificates Pack

    తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ దృవీకరణ పత్రం నమూనా. (తెలుగు లోను మరియు ఆంగ్లం లోను )

pack

    తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ దృవీకరణ పత్రం నమూనా. (తెలుగు లోను మరియు ఆంగ్లం లోను )

గమనిక : సర్టిఫికేట్ పొందే విధానం ? తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో మీ రికార్డు నమోదు అయిన తరువాత రికార్డు కి సంబందించిన విభాగం వారు ఈ మెయిల్ ద్వార మీ రికార్డు కి సంబందించిన దృవీకరణ పత్రాన్ని పంపడం జరుగును , ఆ తాత్కాలిక దృవీకరణ పత్రాన్ని పరిశీలించి , మీ రికార్డు కి సంబంధించిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా పేరు ఇంటిపేరు మీ రికార్డు లో కొలతలు మిగితా వివరాలు సరి చూసుకుని తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ ద్వార తెలియజేయాలి , ఆ తరువాత మీ రికార్డు కి సంబందించిన సర్టిఫికేట్ + మెమెంటో + కారు స్తిక్కర్స్ లతో కూడిన రికార్డు ప్యాక్ మీ ఇంటికి కొరియర్ ద్వార పొందగలరు .

 

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ వారు అందజేసే దృవీకరణ పత్రం సరిఅయినది లేక సరికానిది అని ( వోరిజినల్) గుర్తించడం ఎలా ? తెలుగు బుక్ అఫ్ రికార్డు వారి అందజేసే దృవీకరణ పత్రం పింక్ రంగులో ఉండి నీలి రంగు గల లోగో తో పైన తెలుగు లోను క్రింద ఆంగ్లం లోను లోగో మద్య మన తెలుగు సంప్రదాయానికి చిహ్నంగా ఉనా కలశము , ఆ కలశం పైన తెలుగు మొదటి అక్షరం ” అ ” అని రాసి ఉండి ఎరుపు రంగులో రెండు నక్షత్రాలు ఉండడం గమనించండి. సర్టిఫికేట్ కి పై బాగం లో వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది అందులో వివరించిన నెంబర్ పైన తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ నమోదు జాబితాలో రాయడం జరుగుతుంది. దృవీకరణ పత్రం క్రింద బాగం లో కలశం తో కూడిన దృవీకరణ సీల్ ని గమనించండి. సీల్ కుడి బాగం లో హోలోగ్రాం సెక్యురిటి సింబల్ చూడవచ్చు అందులో తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లోగో కలశం ఉంటుంది . ఇవన్ని సరిగా ఉన్న సర్టిఫికేట్ వోరిజినల్ సర్టిఫికేట్ అని గ్రహించాలి.

గమనిక: ఒక సారి సర్టిఫికేట్ కొరియర్ ద్వార పంపిన పిదప సర్టిఫికేట్ లో మార్పులు చేర్పులకు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ బాధ్యత వహించదు.