SATHADIKA MAHILA KAVI SAMMELLANAM ( “జాతీయ శతాధిక మహిళా కవి సమ్మేళనం”)

కళాశ్రీ సాహితీ వేదిక, జగిత్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో “జాతీయ శతాధిక మహిళా కవి సమ్మేళనం” అనే వినూత్న మహిళా సాహిత్య కార్యక్రమంలో 100 మందికి పైగా కవయిత్రులు స్వయంగా రచించిన వివిధ అంశాలతో కూడిన కవితలను వినిపించడం జరిగింది. దేవి శ్రీ గార్డెన్స్, జగిత్యాల వేధికగా శతాధిక మహిళా కవయిత్రులచే సాగిన ఈ సాహిత్య కార్యక్రమం తేది 24 నవంబర్ 2019, ఉ: 10 గంటలకు ప్రారంభం జరిగింది. ఆబాలగోపాలాన్ని అలరించిన ఈ ప్రత్యేక కార్యక్రమం కళాశ్రీ సాహితీ వేదిక అధ్యక్షులు గుండేటి రాజు, సభా సమన్వయ కర్తలు, మద్దెల సరోజన, కటుకం కవిత, అయిత అనిత నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ నందు మన ‘తెలుగు సాహిత్యం’ అనే విభాగంలో నమోదు చేస్తూ… అందిస్తున్న అధికారిక ద్రువీకరణ పత్రం.