SATHA BRUNDHA TALA BHAJANA UTSAVAM

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిల్ ‘శత బృంద తాళ భజన ఉత్సవం‘
శ్రీ షిరిడి సాయి బాబా మందిరం, మైలవరం కృష్ణా జిల్లా వారి 25వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థాయి ‘తాళం భజన పోటీలు‘ నిర్వహించడం జరిగినది. రెండు రాష్ట్రాల నుంచి 100 మంది కళాబృందాలు పోటీలలో పాల్గొనడం విశేషం, ఇటువంటి అరుదైన కళా ప్రదర్శన ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రాచీన కళలను ఒక తాటిపైకి తీసుకువచ్చి వాటిని ఆదరించి అభిమానిస్తున్న శిరిడి సాయిబాబా దేవాలయం భక్త సమాజాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంతో అభినందిస్తుంది. సనాతన సాంప్రదాయ కళలను పౌరాణికా నాటకాలకు ప్రాణం పోస్తున్న శ్రీ బాలాజీ ప్రసాద్ బృందాన్ని మరియు షిరిడి సాయిబాబా భక్తి సమాజాన్ని అభినందిస్తూ... తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రప్రధమంగా ఈ యొక్క ‘శత తాళ భజన ఉత్సవ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక విభాగంలో నమోదు చేయడం జరుగుతుంది. జాతీయ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోఆర్డినేటర్ శ్రీయుత వజ్జల బాలాజీ ప్రసాద్ గారు వారి నేతృత్వంలో జరిగిన ఈ కళా ప్రదర్శనలు ఆబాలగోపాలాన్ని అలరించింది.