Tharanga

PROFESSION BY MAGNETOTHERAPIST AND PASSION BY WRITER

PROFESSION BY MAGNETOTHERAPIST AND PASSION BY WRITER

w1

శ్రీమతి. మాదారపు వాణిశ్రీ భర్త పేరు డా: మాదారపు రాజేందర్. వీరి ప్రస్తుత నివాసం హనుమకొండ, వరంగల్ అర్బన్. వీరు 2వ తేది సెప్టెంబర్ 1965 లో కరీంనగర్ లో జన్మించారు. వీరు చిన్నతనం నుండే సాహిత్యం పై ఉన్న మక్కువతో తన కున్న పరిజ్ఞానంతో సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గత 14 సంవత్సరాల వ్యవధిలో వివధ దిన, పక్ష, మాస, పత్రికలలో వందలాది శీర్షికలు, కవితలు, కథలు , గేయాలు ప్రచురించబడినవి. ఒకే సంవత్సరం లో విభిన్న అంశాలతో కూడిన ఆరు పుస్తకాలు 1. మనసు పలికే (కవిత్వం) 2. పదనిసలు (కథాగుఛ్చము) 3. సెలవుల్లో పట్నం పిల్లలు (బాలల నవల) 4. చిచ్చుబుడ్లు (బాలల కథలు) 5. సరదాగా కాసేపు (మెదడుతో ఆట) 6. మా తల్లీ.. బతుకమ్మా ! ( బతుకమ్మ పాటలు) అనే పుస్తకాలను రచించడం మరియు ఒకే వేదికపైన ఆవిష్కరించడం అభినందనీయం. సాహిత్య రంగం లో తనదైన శైలిలో రచనలు సాగిస్తున్న వీరిని అభినందిస్తూ… ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో ‘మహిళా విభాగం’లో ఒక ప్రత్యేక అవార్డుగా తన పేరును నమోదు చేస్తున్నట్లు అధికారికంగా అందిస్తున్న ధృవీకరణ పత్రం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *