MOST DEVOTEES RECITED VISHNU SAHARA NAMA PARAYAM IN SINGLE VENUE
అత్యధిక భక్తులచే … శ్రీ విష్ణుసహస్ర నామ పారాయణ స్వర ఝారి
శ్రీ రుక్మిణి సత్యసమేత వేణుగోపాలస్వామి ఆశీస్సులతో..
ప్రప్రదముగా తెలంగాణ రాష్ట్రములో ‘వికాస తరంగిణి’, చేర్యాల శాఖ వారి నిర్వహణలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వేదికగా 1001 మంది భక్తులతో సామూహికంగా ఏక కాలములో ‘శ్రీ విష్ణుసహస్ర నామ పారాయణ స్వర ఝురి’ తేది: 27 జనవరి, 2018 న సా: 4:00 నుండి సాగిన భక్తిరస కార్యక్రమంలో భక్తులందరూ ఉపవాస దీక్షతో పారాయణం గావించడం విశేషం. లోక కళ్యాణార్ధం చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వికాస తరంగిణి సేవా సంస్థ ఆద్వర్యంలో ఆబాలగోపాలాన్ని అలరించినది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మన హైందవ ధర్మ ప్రాచారము, సంస్కృతీ సాంప్రదాయాన్ని పెంపొందించే దిశలో చేస్తున్న ప్రయత్నం అభినందనీయం ఇట్టి కార్యక్రమాన్ని తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ నందు ‘తెలుగు వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు’ అనే విభాగంలో నమోదు చేసూ.. అందిస్తున్న ధృవీకరణ పత్రం