GEETHA AVADHAANAM BY Dr. YEDLA PALLI MOHAN RAO

స్వార్ధ భారతి – SPEL – G C TRUST మరియు శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడినది “గీతావధానము”. ఈ ఆధ్యాత్మిక, అష్టావధాన కార్యక్రమంలో ‘గీతాచార్య’ , సత్య శోధన – శక్తి సాధన సెమినార్ల నిర్వాహకులు లయన్ డా: యడ్లపల్లి మోహనరావు అవధానిగా వ్యవహరించారు. ఈ వినూత్న “భగవద్గీత”. అష్టావధాన కార్యక్రమం ఆబాలగోపాలాన్ని అలరింఛి, ఆలోచింప జేసి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటడమే కాక మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయ రీతులను, ధర్మనిష్ఠను ప్రకటించడం ” తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ “లో నమోదుకు అర్హత పొందినది. తోలి ప్రశస్త ప్రక్రియగా ఈ గీతవధానము దత్తపది, శ్లోకము – సంఖ్య, శ్లోక తాత్పర్యం/అర్ధం , పాదవ్యతిక్రమము, వ్యస్తాక్షర శ్లోకం, శ్లోకధార, విశేషాంశం, అప్రస్తుత (ప్రస్తుతి ) ప్రసంగం వంటి ఎనిమిది అంశాలతో నిర్వహించబడి తొలి ప్రక్రియగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు ప్రత్యేక విభాగంలో నమోదు చేస్తున్నట్లు అధికారికంగా అందిస్తున్న అభినందన పత్రం.