AMAZING AND UNBELIEVABLE FEATS PERFORMED BY POOR

సాహస వీర తెలుగు బుక్ ఆఫ్ రికార్డు టైటిల్
భూక్యా కృష్ణ, తండ్రి భూక్య వెంకటేశ్వరరావు తల్లి భూక్య తిరుపతమ్మ, 15 ఆగస్టు 1971 సంవత్సరం, సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామములో గిరిజన కుటుంబములో జన్మించారు. చదువు ఎం.ఏ. హిందీ పండిట్, చిరు వ్యాపారం చేస్తూ వారి కుటుంబ జీవనం భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట మండలం నారా వారి గూడెం లో జీవనం కొనసాగిస్తున్నారు. వీరు చిన్నతనం నుంచే అతిక్లిష్టమైన కఠోరమైన సాహస విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యచకితులను చేయటం వీరి ప్రత్యేకత, సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను చేతబడి బాణామతి దెయ్యాలను భూతాలను ఇవి ఏమీ లేవు అని తెలియజేయడానికి ఈ యొక్క సాహస విన్యాసాలు ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నదే వీరి ఆలోచన. కడు పేదరికం లో జన్మించిన భూక్య కృష్ణ గిరిజన తెగకు చెందిన ఒక వీరుడు. కృష్ణ గారు దాదాపు 35 సంవత్సరాలుగా ఈ యొక్క కళను ప్రదర్శిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నా.. వీరి సాహసాలను జాతీయ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు ఒక ప్రత్యేక విభాగంలో వీరి పేరుని నమోదు చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరిస్తూ అందజేస్తున్న పత్రం.