4000 SONGS ON VARIOUS SUBJECTS BY VN BROTHERS
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయార్ స్వామి వారి మంగళశాసనములతో…
మాన్యకవులు, వాగ్గేయకారులు, శ్రీ భట్టు వెంకన్న, శ్రీ భట్టు నాగేశ్వరరావు, వీరి తల్లిదండ్రులు శ్రీమతి సాలిబాయి, కీ:శే: శ్రీ భట్టు భల్యా నాయక్, వీరు మేడ్చెల్, తెలంగాణ రాష్ట్రమునకు చెందిన వారు. వీరు ఇరువురు సోదరులు కలసి తొలిసారిగా గిరిజన, లంబాడి తెగలలో వెలసిన జానపద సహీతీముర్తులుగా తెలంగాణ యాస, ప్రాస మాండలికము, సాధారణ పద జాలములతో 4000 వేల సంఖ్యలో పాటలు రాయడం పాడడం జరిగినది. గిరిజన వాసులుగా వారు, సాహిత్య లోకానికి నీరాజనాలు పలుకుతున్నారు, వీరి రచనల్లో కొన్ని… శ్రీ వెంకటేశ్వర స్వామి, దశవతారాల గురించి, చీకటిలో చిరువెన్నల, గోవింద నామ ఝురి, ఓ కాలమా నేకు వందనం, తెలంగాణ సామూహిక ఉద్యమ నేపద్యం పాటలు, దేశం గురించి పాటలు ఇలా సామజిక అంశాల పైన మరియు అనేక అంశాలతో కూడిన మానవ నైతిక విలువలను పెంపొందించి సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న ఈ ఇరువురు సోదరులు అభినందనీయులు, ఈ గిరిజన వాగ్గేయ కారులను తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ నందు ప్రత్యేక విభాగంలో నమోదు చేస్తూ అందిస్తున్న ధృవీకరణ పత్రం.