ఉచితంగా అమరజీవి పొట్టి శ్రీ రాములు మరియు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలను పాఠశాలలో ప్రతిష్ట
శ్రీ చిన్న రామసత్యనారాయణ ( Ch R ) గారు, తండ్రి చిన్న బుచ్చయ్య , తల్లి పుల్లమ్మ గారు, గౌ: అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం, జంగారెడ్డి గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇప్పటి వరకు 200 కి పైగా అమరజీవి పొట్టి శ్రీ రాములు మరియు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలను జంటగా అనేక గ్రామాలకు ఉచితంగా ఇస్తూ పాఠశాలలో ప్రతిష్ట చేయించడం వీరు ప్రత్యేకత. అమరజీవి పొట్టి శ్రీ రాములు మరియు జాతిపిత మహాత్మాగాంధీ గురించి వారి సేవ త్యాగనిరతి వారి ఆదర్శ జీవితాలు నేటి తరానికి స్ఫూర్తి కావాలని శ్రీ చిన్న రామసత్యనారాయణ ( Ch R ) గారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలను గుర్తించి తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో వారి పేరుని నమోదు చేయడం జరిగినది.