Tharanga

12 HOURS NON STOP 108 DEVOTIONAL SONGS SUNG BY WOMEN

12 HOURS NON STOP 108 DEVOTIONAL SONGS  SUNG BY WOMEN

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిల్ ‘108 భక్తీ సంకీర్తన రవళి’
భారతీయ సంగీత కళ సృష్టిలో లబ్ధప్రతిష్టులైన సంగీత విద్వాంసుల వద్ద సంగీత విద్యను  నేర్చుకుని పండిత పామరులను సైతం తన అమృతమైన గాత్రంతో శ్రావ్యంగా  ఆలపించి సనాతన సాంప్రదాయ కళలకు జీవం పోస్తున్నారు నేటితరం గాయని శ్రీమతి అల్లం రమాదేవి గారు  భర్త శ్రీ అల్లం నాగేశ్వరరావు గారు బద్రాద్రి కొత్తగూడెం జిల్లా బద్రాచలం వాస్తవ్యులు. వీరు 28 ఏప్రిల్, 2019 రోజున ఉదయం 9 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు  108 కీర్తనలను ఆలపించడం జరిగింది ఈ సంగీత ‘సంకీర్తన రవళి’ పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆబాలగోపాలాన్ని అలరింపజేసింది.   ఈ కార్యక్రమంలో  రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, త్యాగరాజ స్వామి కీర్తనలు, మరియు నృసింహ స్వామి దాసు కీర్తనలు మొత్తము 108 కీర్తనలు ఆలపించడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన సంగీత కళా ప్రదర్శనను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక ప్రత్యేక సంగీత కళ విభాగంలో  పొందుపరచటం జరిగింది.  అంతరించిపోతున్న సంగీత కళలను కీర్తలను ఒక తాటిపైకి తీసుకువచ్చి నేడు ఆ కళకు జీవం పోసి మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తమ అమూల్యమైన గాత్రాన్ని అందించినటువంటి శ్రీమతి రమాదేవి గారిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంతో గౌరవంగా సన్మానించి సత్కరించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  టైటిల్ వారికి అందించడం జరుగుతుంది. నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం భద్రాచలంలోని శ్రీ చిత్రకూట మండపంలో ఉదయం 9 గంటలకు ప్రారంభించి భద్రాచలం శ్రీ రాముల వారి సన్నిధిలో ప్రదర్శన ముగిసినది.

WhatsApp Image 2019-05-03 at 11.56.09

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *